హైదరాబాద్‌లో 247 మంది మందుబాబులకు జైలుశిక్ష...
- January 09, 2017
శివారులో 9 రోజుల్లో 835 కేసులు
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ : కొత్త ఏడాదిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఖాకీలు నడుం బిగించారు. మందుబాబులపై కొరడా ఝళిపిస్తున్నారు. జనవరి 1 నుంచి సోమవారం వరకు సైబరాబాద్, రాచకొండ పరిధిలో 835 మంది మందుబాబులను పట్టుకున్నారు. అధికంగా రాజేంద్రనగర్‌లో 95, అల్వాల్‌లో 92 మంది పట్టుబడ్డారు. మొత్తం 247 మందికి జైలుశిక్ష విధిస్తూ మియాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్ న్యాయస్థానాలు వేర్వేరుగా తీర్పు వెలువరించాయి. ఎక్కువ మందికి 4-8 రోజుల వరకు జైలుశిక్ష పడింది. ''కొత్త ఏడాదిలో రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం.
అందులో భాగంగా ప్రత్యేకంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌లు ఏర్పాటుచేశాం. ఔటర్‌పై ప్రమాదాలను తగ్గిస్తాం. మందుబాబులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. రమ్య, సంజన లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం.
మందుబాబులకు డీఆడిక్షన్ కేంద్రంలో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం.'' అని రాచకొండ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్ రావు తెలిపారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







