విడుదలైన 'గుంటూరోడు' ట్రైలర్.!

- January 11, 2017 , by Maagulf
విడుదలైన 'గుంటూరోడు' ట్రైలర్.!

మంచు మనోజ్‌ కథానాయకుడిగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'గుంటూరోడు'. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. హీరో మనోజ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''గుంటూరోడు' ట్రైలర్‌.. చూసి మీ అభిప్రాయం చెప్పండి' అని ట్వీట్‌ చేశారు. మనోజ్‌ యాక్షన్‌తో కూడుకున్న ఈ ట్రైలర్‌ చక్కగా ఉందని నటులు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. చిత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. వీరికి మనోజ్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రజ్ఞా జైశ్వాల్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీవరుణ్‌ అట్లూరి చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీ వసంత్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, కోటా శ్రీనివాసరావు, రావు రమేశ్‌, పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com