ఈ నెల 25న విడుదల కానున్న'కనుపాప' ఆడియో
- January 11, 2017
మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పం. ఈ చిత్రం మలయాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో ఒప్పం చిత్రం 50 కోట్లుకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలో సంచలనం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని కన్నడలో శివరాజ్ కుమార్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని దిలీప్ కుమార్ బొలుగోటి సమర్పణలో మోహన్ లాల్ నిర్మాతగా కనుపాప అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం విశేషం.
ఒప్పం కథ విషయానికి వస్తే..ఈ చిత్రంలో మోహన్ లాల్ అంధుడిగా నటించారు. అంధుడైన మోహన్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా వర్క్ చేస్తుంటాడు.
ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసిన కిల్లర్ తప్పించుకుంటాడు. అయితే..మర్డర్ చేసిన కిల్లర్ ను అంధుడైన మోహన్ లాల్ ఎలా పట్టుకున్నాడు అనేది ఒప్పం కథ.
సంచలనం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా మంది ఇంట్రస్ట్ చూపించారు కానీ.రీమేక్ రైట్స్ ఎవరికీ ఇవ్వకుండా తెలుగులో కనుపాప అనే టైటిల్ తో అనువదిస్తున్నారు. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాల విజయాలతో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో కనుపాప మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన మోహన్ లాల్ కనుపాప చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఆశీర్వాద్ సినిమాస్, వన్ ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా అందిస్తున్న కనుపాప చిత్రం ఆడియోను ఈనెల 25న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ హీరో కనుపాప ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఇక చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా కనుపాప మూవీ గురించి మోహన్ లాల్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ కనుపాప. ఈ చిత్రంలో నేను అంధుడిగా నటించాను. ఫిబ్రవరి 3న కనుపాప చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. మలయాళంలో ఒప్పం చిత్రాన్ని ఆదరించినట్టే తెలుగులో కనుపాప చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
.
చిత్ర సమర్పకుడు దిలీప్ కుమార్ బొలుగోటి మాట్లాడుతూ.ఒప్పం చిత్రాన్ని మోహన్ లాల్ గారితో తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. మోహన్ లాల్ నిర్మాతగా అందిస్తున్న ఈ చిత్రానికి నేను సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈనెల 25న ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మలయాళంలో కంటే పెద్ద విజయాన్ని తెలుగులో సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







