విడుదలైన 'ఘాజీ' ట్రైలర్
- January 11, 2017
రానా దగ్గుబాటి లేటెస్ట్ చిత్రం 'ఘాజీ'. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. సరికొత్తగా వుంది ఈ ట్రైలర్. 'యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, శత్రువు ప్రాణాలు తీయడం' అనే డైలాగ్‌తో మొదలయ్యే ఈ ట్రైలర్ వైవిధ్యంగా సాగింది. 1971 ఇండో-పాక్ యుద్ధానికి ముందు జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రమిది 'ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా.. విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం.. జైహింద్' అని అప్పటి నావీ అధికారులు చెబుతున్న డైలాగు ఈ సినిమా కధను తెలుయజేస్తుంది. ఇండో-పాక్ యుద్ధం సమయంలో ఘాజీ అనే సబ్ మేరైయన్ పై దాడి జరిగింది.
ఇది చరిత్ర. ఇందులో ఆధారాలను తీసుకొని ఈ చిర్రాన్ని రూపొందిస్తున్నారు. సంకల్ప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సి, కే కే మేనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 17న 'ఘాజీ' చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రానికి పీవిపీ నిర్మాత.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







