ట్విట్టర్ నుంచి అవుట్!...

- January 12, 2017 , by Maagulf
ట్విట్టర్ నుంచి అవుట్!...

కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకోవాల్సింది పోయి, ఉన్న ఫీచర్లను తొలగిస్తోంది ట్విట్టర్. బిజినెస్ లకు ఎక్కువగా ఉపయోగపడే డ్యాష్ బోర్డ్ ఫీచర్ ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 2016 జూన్ లో లాంచ్ చేసిన ఈ ఫీచర్ ను 2017 ఫిబ్రవరి 3 నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు పేర్కొంది. ట్వీట్లను ట్రాక్ చేయడం, అనాలిటిక్స్ ను పొందడం వంటి పలు వాటిని ఈ ఫీచర్ ఆఫర్ చేస్తోంది. అయితే తొలగిస్తున్న ఈ ఫీచర్ అనంతర ప్లాన్స్ ఏమిటన్నది ట్విట్టర్ తెలుపలేదు. బిజినెస్ ల కోసం ఇదేమాదిరి ఫీచర్లను ఎలా వాడుకోవాలనే దానిపై క్లారిటీ లేదు.
భవిష్యత్తులో డ్యాష్ బోర్డు నుంచి ట్విట్టర్ కమ్యూనిటీ బోర్డర్ లో మంచి ఫీచర్లను తీసుకొస్తామని తాము ఆశిస్తున్నట్టు ట్విట్టర్ డ్యాష్ బోర్డు పలు ట్వీట్లను చేసింది.
ఎక్కువమంది దీన్ని ఇన్ స్టాల్ చేసుకోకపోవడంతో ఈ ప్రొడక్ట్ ను తొలగిస్తున్నట్టు తెలిపింది. బిజినెస్ యాప్స్ కేటగిరిలో ట్విట్టర్ డ్యాష్ బోర్డుకు చాలా తక్కువగా 432 ర్యాంకు నమోదైంది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ యాప్ ను 40వేల సార్లే డౌన్ లోడ్ చేశారు. 2016 అక్టోబర్ లో వైన్ ను కూడా ట్విట్టర్ క్లోజ్ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com