'యు.ఏ.ఈ కి చెందిన మానవతా సేవ విదేశాల్లోనూ కొనసాగుతుంది'
- January 12, 2017
అబూధాబీ:యు.ఏ.ఈ కి చెందిన మానవతా రాయబారులు విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా సాయుధ విభేదాలు ఏర్పడినపుడు బాధితుల పక్షాన ఉండి సహాయం చేసి వారికి మద్దతు అందచేయడం కొనసాగుతుందని ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ బోర్డు ( ఇ ఆర్ సి ) చైర్మన్ డాక్టర్ హందాన్ అల్ మజ్రౌయి చెప్పారు. ఆఫ్గనిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన యుఎఇకి చెందిన మానవతావాద కార్యకర్తల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన అల్ మజ్రౌయి మాట్లాడుతూ వారు అక్కడకు వెళ్లి విద్యా కేంద్రాలు, అనాధ శరణాలయాలు నిర్మించి ఆదుకోవాల్సిన వ్యక్తులను సహాయం చేసే సమయంలో నీతులు మరియు మతాలకు వ్యతిరేకంగా వారికి హాని జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.యుద్ధం తరువాత ఆ దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో ఆఫ్గనిస్తాన్ కు సహాయపడింది యుఎఇ అని చెప్పిన ఆయన ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ బోర్డు ( ఇ ఆర్ సి ) ద్వారా మానవతా దృక్పథంతో యుఎఇ నిర్వహించిన చరిత్ర గురించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఆ దేశంలో ఆఫ్ఘన్లు కోసం నిర్మించిన పాఠశాలలు, ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ఇళ్ళు మరియు అనాధ శరణాలయాలు నిర్మించేందుకు ఎంతో సాయం అందించిందని ఆయన గుర్తు చేశారు.యుఎఇ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవారు, హాని జరిగిన ప్రజలకు యుద్ధంలో దెబ్బతిన్నఆఫ్ఘన్లకు అలాంటి సాయం అందించడం కొనసాగుతుందని అల్ మజ్రౌయి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







