ఎన్బికె కొత్త ఫింగర్ ప్రింట్ ఫీచర్
- January 12, 2017
నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (ఎన్బికె), తమ వినియోగదారులకు మరింత మెరుగైన అప్ టు డేట్ బ్యాంకింగ్ ఇ-సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అక్కౌంట్‌ని తమకు కావాల్సిన విధంగా వాడుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. టచ్ ఐడి లాగిన్ ఫీచర్‌ని యాండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా వినియోగించుకోవచ్చు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ల స్థానంలో ఈ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, వినియోగదారులకు అద్భుతమైన సేవల్ని అందించడంలో తాము ముందున్నామని ఎన్బికె వర్గాలు వెల్లడించాయి. ఫింగర్ ప్రింట్ ఫీచర్‌పై మరిన్ని వివరాలకు బ్యాంక్ కస్టమర్ కేర్ని సంప్రదించి తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







