సూపర్ మార్కెట్లో పగలు ప్రవేశించి దాక్కొని...
- January 13, 2017
షార్జా : గంటలు గంటలు ఒకే చోట నిలబడి బొమ్మలు గీయడం ద్వారా ఏమంత సొమ్ములు వస్తున్నాయని మధనపడ్డాడేమో ఆ దొంగ ? ఊచలు కోయడం..గోడలు ఎక్కడం.. కన్నం వేయడంలాంటి శారీరక శ్రమ ఏం పడతామని ఓ దిక్కుమాలిన ఆలోచన చేశాడా బద్ధకపు దొంగ .పథకం విజయవంతమైంది కానీ ఆధారాలు ఆ చోరుడిని ఎంచక్కా పట్టించాయి. వివరాలలోకి వెళితే, ఓ భారతీయ కార్మికుడు షార్జాలో పగిటివేళ సాధారణ వినియోగదారుని మాదిరిగా షార్జా లోని హోరు అల్ ఆన్స్ ఒక సూపర్ మార్కెట్ లోకి దర్జాగా ప్రవేశించి ..దుకాణం మూసే ముందు అక్కడే ఎవరికీ కనబడకుండా ఓ మూల నక్కి రాత్రి అక్కడ తలదాచుకొని . అర్ధరాత్రి అంతా సద్దుమణిగేక తనకు అవసరమైన నగదు మరియు వస్తువులను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుని మరీ దొంగిలించాడు.అకస్మాత్తుగా దుకాణంలో సరుకు తగ్గిపోవడం ...దొంగతనం జరిగినట్లు స్పష్టంగా కనబడటంతో అక్టోబర్ 11 వ తేదీ 2016 హోరు అల్ ఆన్స్ సూపర్ మార్కెట్ లో దోపిడీ జరిగిందని అల్ మూరఖ్క్అబె దుకాణ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది . భారతీయ కార్మికుడి కోర్టు ఎదుట హాజరుపర్చారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ నిందితుడు ఓ 22 ఏళ్ల భారతీయ కార్మికుడు ఒక చిత్రకారుడు, పదునైన పరికరాలు మరియు వ్యక్తిగత ఆస్తి నష్టంకు కల్గించే పనిముట్లను ఉపయోగించి రాత్రి దోపిడీకి పాల్పడ్డాడు.ఈ దొంగకు తోడు మరొక భాగస్వామి కలిగి ఉన్నట్లు కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సూపర్ మార్కెట్ లో సేకరించిన వేలిముద్రలు పోలీసులు నవంబర్ 22 వ తేదీ 2016 న క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్టుమెంటు నుండి ఫోరెన్సిక్స్ నివేదిక అందుకున్న ఆ నమూనా వేలిముద్రలతో సరిపోయే వేలిముద్రలు గల ఒక కార్మికుడిని షార్జాలో పోలీసులు అరెస్టు చేశారు. తోడుదొంగతో కలిసి దోపిడీకి పాల్పడినట్లు నివేదించారు.రెండో వ్యక్తి సూపర్ మార్కెట్లో దోచుకొన్న సొమ్ముని రీఛార్జ్ కూపన్లను గిడ్డంగి లో దాచిపెట్టాడు.మొబైల్ రీఛార్జ్ కార్డులు స్వాధీనం మరియు నగదు డబ్బు వైరింగ్ రశీదులు మరియు 2,175 డి హెచ్ దొరికింది.సూపర్ మార్కెట్ లో పనిచేసే ఓ 45 ఏళ్ళ భారతీయ మేనేజర్, పోయిన వస్తువులని అంచనా వేశాడు మొత్తం విలువ రీఛార్జ్ కార్డులు మరియు మొబైల్ ఫోన్ లతో కలిపి నగదు 4,900 డి హెచ్ సహా 30,000 డి హెచ్ ఉంటుందని అంచనా వేశారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







