ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు
- January 14, 2017
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈనెల 17వ తేదీన ఎంజీఆర్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పన్నీర్‌సెల్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ జయంతి రోజున ప్రత్యేక స్టాంపులను విడుదల చేస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 6న సీఎం పన్నీర్‌సెల్వం ఎంజీర్ పేరిట స్మారక నాణేలు, స్టాంపులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్రం అందుకు అంగీకరించింది. జనవరి 17, 1917లో ఎంజీ.రామచంద్రన్ జన్మించారు. 1977-1987 మధ్యకాలంలో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1972లో ఆయన అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







