దుబాయ్‌లో షారుక్‌ఖాన్‌

- January 15, 2017 , by Maagulf
దుబాయ్‌లో షారుక్‌ఖాన్‌

బాలీవుడ్‌ మెగాస్టార్‌ షారుక్‌ఖాన్‌, తన తాజా చిత్రం 'రయీస్‌' ప్రమోషన్‌ కోసం దుబాయ్‌ విచ్చేస్తున్నాడు. బాలీవుడ్‌ పార్క్స్‌లో జనవరి 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన్ని కలుసుకోవచ్చు. విజిటర్స్‌, ఇక్కడే సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌తో కలిసి ఫొటోలు దిగేందుకు అవకాశం ఉంది. గుజరాత్‌లో ప్రొహిబిషన్‌కి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌లో ఓ సెట్‌ని రూపొందించారు. ఆల్కహాల్‌ ఇండస్ట్రీకి సంబంధించిన కథాంశంతో 'రయీస్‌' రూపొందుతోన్న సంగతి తెలిసినదే. రాహుల్‌ ఢోలాకియా ఈ చిత్రానికి దర్శకుడు. నవాజుద్దీన్‌ సిద్ధికీ, పాకిస్తానీ నటి మహీరాఖాన్‌ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. జనవరి 25న ఈ చిత్రం విడుదలవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com