నటుడు శివ బాలాజీ కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేశారు

- September 12, 2015 , by Maagulf
నటుడు శివ బాలాజీ కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేశారు

ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, 'శంభో శివ శంభో వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ. విలక్షణమైన పాత్రల్లో నటించిన శివబాలాజీ ఇప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే తలంపుతో నిర్మాతగా మారారు. గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా 'పడ్డానండీ ప్రేమలో మరి' వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఓ సినిమాని రూపొందిస్తున్నా. శివబాలాజీతో పాటు ఇటు విలన్ గా, అటు క్యారెక్టర్ ఆరిస్ట్ గా రాణిస్తున్న అజయ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తోరూపొందనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న లాంఛనంగా ప్రారంభం కానుంది. 1980 బ్యాక్ డ్రాప్ పై ఈ సినిమా రూపొందనుంది. ఓ నిజ ఘటన ఆధారంగా దర్శకుడు మహేష్ ఉప్పుటూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శివబాలాజీ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్; నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com