ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి..
- January 16, 2017
నిరుద్యోగ యువతకు వూరట కలిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా వివిధ కేటగిరీల్లో మొత్తం 201 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ 67 పోస్టులు, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ - 90, టెక్నికల్ అసిస్టెంట్లు - 12, జూనియర్ అసిస్టెంట్లు - 32 మొత్తం 201 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ పోస్టులన్నింటినీ నియమాకాలు చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం...
ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తాజాగా టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ... కీలకనిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ ఉద్యోగాల నియామకాలు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







