వరుస దొంగతనాలు దోపిడీలు చేసే ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- January 17, 2017
రియాద్: రాజధానిలో వరుస దొంగతనాలకు మరియు దోపిడీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గల ఐదుగురు సభ్యులు గల ఒక ముఠాను గత వారం పోలీసులు అరెస్టు చేశారు. రియాద్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగల ముఠా పలు విలువైన వస్తువులతో కలిపి1.5 మిలియన్ సౌదీ రియాళ్ళ నగదుని దోచుకొన్నారని పేర్కొన్నారు.ఈ ముఠాలో నల్గురు సౌదీలు మరియు ఒక సుడాన్ జాతీయుడు ఉన్నారు. వీరు ఇళ్లల్లో మరియు నిలిపిన వాహనాల నుండి విలువైన వస్తువులను అపహరిస్తామని అంగీకరించారు. ఒక ఇంటిలో దొంగతనం చేసి తిరిగివస్తున్న సందర్భంలో పోలీసులు
సుడానీ, సౌదీ జాతీయులను పట్టుకొన్నారు. మరో సంఘటనలో వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసిన తర్వాత దోపిడీలు జరిపే దొంగలను పట్టుకొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏ శబ్దం లేకుండా గోడలకు కన్నాలు వేయడం, ఎటువంటి శబ్దాలు లేకుండా గాజు కిటికీలు విచ్ఛిన్నం చేయడంలో బాగా ఆరితేరారని తెలిపారు.ఎంతో నిశబ్ధంగా దొంగిలించిన వస్తువులని అక్కడ్నించి తరలిస్తారని చెప్పారు. ముఠాలో ఉన్న మిగిలిన అనుమానితులను కనుగొనడానికి, దొంగిలించిన సొత్తుని కనుగొనడానికి ఇంకా కొన్ని పరిశోధనలు నిర్వహిస్తున్నామని పోలీసులు వివరించారు. పరిశోధనలు పూర్తయ్యాక అనుమానితుల వివరాలను కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసులు అన్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







