వరుస దొంగతనాలు దోపిడీలు చేసే ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

- January 17, 2017 , by Maagulf
వరుస దొంగతనాలు దోపిడీలు చేసే ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

రియాద్: రాజధానిలో వరుస దొంగతనాలకు మరియు దోపిడీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గల  ఐదుగురు సభ్యులు గల ఒక ముఠాను గత వారం పోలీసులు అరెస్టు చేశారు. రియాద్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగల ముఠా పలు విలువైన వస్తువులతో కలిపి1.5 మిలియన్ సౌదీ రియాళ్ళ నగదుని దోచుకొన్నారని పేర్కొన్నారు.ఈ ముఠాలో నల్గురు సౌదీలు మరియు ఒక  సుడాన్ జాతీయుడు ఉన్నారు. వీరు ఇళ్లల్లో మరియు నిలిపిన వాహనాల నుండి విలువైన వస్తువులను అపహరిస్తామని అంగీకరించారు. ఒక ఇంటిలో దొంగతనం చేసి తిరిగివస్తున్న సందర్భంలో పోలీసులు  

సుడానీ, సౌదీ జాతీయులను పట్టుకొన్నారు. మరో సంఘటనలో వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసిన తర్వాత దోపిడీలు జరిపే దొంగలను పట్టుకొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,  ఏ శబ్దం లేకుండా గోడలకు కన్నాలు వేయడం, ఎటువంటి శబ్దాలు లేకుండా గాజు కిటికీలు విచ్ఛిన్నం చేయడంలో బాగా ఆరితేరారని తెలిపారు.ఎంతో నిశబ్ధంగా దొంగిలించిన వస్తువులని అక్కడ్నించి తరలిస్తారని చెప్పారు. ముఠాలో ఉన్న మిగిలిన అనుమానితులను కనుగొనడానికి, దొంగిలించిన సొత్తుని కనుగొనడానికి ఇంకా కొన్ని పరిశోధనలు నిర్వహిస్తున్నామని పోలీసులు వివరించారు. పరిశోధనలు పూర్తయ్యాక అనుమానితుల వివరాలను కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసులు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com