ఉద్యోగార్ధులకు ఉచితం భోజనం అందిస్తున్న దుబాయ్ లోని ఆసియా రెస్టారెంట్..
- January 18, 2017
' సపాటు...ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ ' అని ఉద్యోగాలు వెతికే నిరుద్యోగి దుబాయ్ నగరంలో నీరసపడిపోంనక్కరలేదు !! తన్నగా మధ్యాహ్న భోజనానికి ఆ హోటల్ కు వస్తే చాలు కడుపు నిండా ఆహరం పెట్టి పంపుతారు..దానాలలో గొప్ప దానం అన్నదానం అని భావించేమో బహుశా దుబాయ్ కరమా ప్రాంతంలోని నోమ్ నోమ్ ఆసియా రెస్టారెంట్ మరియు ఆల్ బార్ష లో ఈ సౌకర్యం కల్పించారు. వారంలో ఒక రోజు ఇక్కడ ఒక ప్రధాన వంటకం , నూడుల్స్ లేదా అన్నం,నీటిని ఉద్యోగార్థి ఎంచుకోవచ్చు. ఇక్కడ నిరుద్యోగులకు భోజనం ఉచితంగా వడ్డిస్తారు. అయితే ఈ దాతృత్వం అవసరం లేదని భావించే అభిమానస్తులకు ఆ డబ్బుని తమకు ఉద్యోగాలు వచ్చిన వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించే విధానం ఏర్పాటుచేశారు. ఆ తరహా మొహమాట నిరుద్యోగులకు రెస్టారెంట్ ముందు ఏర్పాటు చేసిన బోర్డు పరిశీలించాలని చెల్లించడానికి తగిన ఫార్మాట్లను గమనించాలని హోటల్ యాజమాన్యం పేర్కొంది. ఆల్ బార్ష రెస్టారెంట్ కరమ శాఖ నిరుద్యోగుల పట్ల ఈ ఔదార్యం గత ఏడాది జూన్ లో ప్రారంభమైంది. కనీసం ఒక సంవత్సరం ఈ విధంగా చేయాలని నిర్ణయించుకొంది. దుబాయికి చెందిన ఒక ఆహార సలహాదారుడు లాబీబా లలిత్ ద్వారా సామాజిక మీడియాలో ఉద్యోగాలు వెతుక్కొని వారి కోసం ఈ హోటల్ బోర్డు ఫొటోని అందరకి షేర్ చేశారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







