కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఎయిర్ ఏషియా.!
- January 18, 2017
విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశ రాజధాని దిల్లీ నుంచి రెండు కొత్త సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులు 2017 ఫిబ్రవరి 19నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి అమర్ అబ్రోల్ తెలిపారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ... దిల్లీ - శ్రీనగర్, దిల్లీ - బాగ్డోగ్రాకి మధ్య ఈ నూతన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే దిల్లీ - పుణె మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.
2016లో సంస్థకు మంచి లాభాలు వచ్చాయని, 2017లోనూ అదే దిశగా తాము ప్రయత్నాలు జరుపుతున్నామని. ఇందులో భాగంగానే ఈ నూతన సర్వీసులను ప్రారంభించినట్లు అమర్ వెల్లడించారు. దిల్లీ, బెంగళూరు నుంచి ప్రయాణికులను తమ సంస్థ 13 గమ్యస్థానాలకు చేర్చుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలపై ఆఫర్లు ప్రకటించింది. దిల్లీ - శ్రీనగర్ మధ్య టికెట్ ధర రూ.1,999 ఉండగా, దిల్లీ - బాగ్డోగ్రాకి రూ.2,499, దిల్లీ- పుణెకి రూ.2,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







