మాలిదేశంలో ఆత్మాహుతి దాడి, 40 మంది మృతి
- January 18, 2017
మాలి: ఆఫ్రికాఖండంలోని మాలిదేశంలో జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కారులో వచ్చి తనను పేల్చుకొని ఘాతుకానికి పాల్పడ్డాడు. దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న గావో ఎయిర్పోర్టు సమీపంలోని మాజీ తిరుగుబాటుదారులు, సైనికుల స్థావరాలపై దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది అక్కడికక్కడే మృతిచెందగా 60 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మాలీ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







