త్వరలో రానున్న 20 లక్షల ఉద్యోగావకాశాలు.!
- January 18, 2017
కొత్త కొత్త సర్వీసు ప్రొవేడర్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూ టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణానికి తెరలేపుతున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి టెలికాం కంపెనీలు కొత్త ఉద్యోగవకాశాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో 2017లో టెలికాం రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త సర్వీసులు ప్రొవేడర్ల ఎంట్రీ, ప్రభుత్వ 'మేకిన్ ఇండియా' లాంటి కార్యక్రమాలు ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే నియామకాలు భారీగా పెరుగుతాయని, హ్యాండ్ సెట్ తయారీదారులు 1.76 మిలియన్లు, సర్వీసు ప్రొవేడర్లు 0.37 మిలియన్ల ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తో కలిసి టీమ్ లీజ్ రిపోర్టు చేసింది.
5జీ టెక్నాలజీతో ఇన్ ఫ్రాక్ట్ర్చర్ రంగంలోనూ దీర్ఘకాలంలో మరిన్ని ఉద్యోగవాకాశాలు వస్తాయని పేర్కొంది. 2020-21లో ఇన్ ఫ్రాక్ట్ర్చర్ 0.92 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపింది. మొత్తంగా 2021 నాటికి 8.7 మిలియన్లకు పైగా ఉద్యోగవాకాశాలకు గ్యారెంటీ అని రిపోర్టు పేర్కొంటోంది. హ్యాండ్ సెట్ ధరలు తగ్గడం, నెట్ వర్క్ లను మెరుగుపరుచుకోవడం కోసం ఆపరేటర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ వ్యాలెట్ల వాడకం పెంపు వంటివన్నీ ఈ రంగంలో కొత్త ఉద్యోగవకాశాలకు దోహదం చేస్తాయని టీమ్ లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీతి శర్మ చెప్పారు. నెట్ వర్క్ ఇంజనీర్స్, ఇన్ ఫ్రా, సైబర్ సెక్యురిటీ ప్రొఫిషినల్స్, అప్లికేషన్ డెవలపర్స్, సిస్టమ్ ఇంజనీర్స్, ఐ-డీఏఎస్ ఇంజనీర్స్, ఇన్ షాప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, హ్యాండ్ సెట్ మ్యానుఫాక్చరింగ్ టెక్నిషియన్స్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్, బ్యాక్ ఆఫీసు అండ్ అడ్మినిస్ట్రేషన్, రిపైర్ ఎగ్జిక్యూటివ్ లకు 2017లో ఎక్కువగా డిమాండ్ ఉంటుందని రిపోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







