రక్తస్రావానికి కరెంటుతో ట్రీట్మెంట్...!
- January 18, 2017
శరీరం మీద గాయమైతే వెంటనే ఏం చేస్తాం. కట్టుకట్టడం ద్వారా రక్తస్రావాన్ని అడ్డుకుంటాం. కానీ భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండదు. పైగా కట్టు వల్ల శరీరం మీద గాయం నుంచి మాత్రమే రక్తస్రావాన్ని అరికట్టగలం. కానీ శరీరంలోపల ఏదైనా అవయవం నుంచి రక్తం కారితే అది ప్రాణాంతకమే. అందుకే ఫెయిన్ స్టీన్ ఇన్సిట్యూట్‌కి చెందిన పరిశోధకులు బయో ఎలక్ట్రిక్ విధానాన్ని రూపొందించారు. ఓ చిన్న పరికరాన్ని శరీరం మీద ఉంచి దాని ద్వారా కరెంటుని శరీరంలోని వేగస్ అనే ప్రధాన నరానికి ప్రవహింపజేస్తారు.
ఈ నాడి మెదడు, గుండె, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలన్నింటికీ అనుసంధానమై ఉంటుంది. దాంతో కరెంటు దీన్ని చేరిన వెంటనే ప్లీహాన్ని ప్రేరేపించి రక్తం గడ్డకట్టే ప్లేట్‌లెట్ కణాలను సంబంధిత భాగానికి పంపించేలా చేస్తుంది. తద్వారా గాయం నుంచి రక్తప్రవాహం ఆగుతుంది. గతంలో దీన్ని పందుల్లో ప్రయోగించి చూడగా అది యాభై శాతం రక్తస్రావాన్ని అడ్డుకోగలిగింది.
దాంతో మరింత లోతుగా పరిశోధన చేసి పూర్తిస్థాయిలో రక్తస్రావాన్ని అడ్డుకోగలిగారు. కాబట్టి ఈ పరిశోదన వల్ల భవిష్యత్తులో శస్త్ర చికిత్సలు మరింత సులభతరం కానున్నాయనీ, అలాగే అంతర్గత రక్తస్రావం కారణంగా నమోదయ్యే మరణాల శాతం తగ్గుతుందనీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









