అమెజాన్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లు...
- January 19, 2017
ఈ- కామర్స్.. సాఫ్ట్వేర్ రంగాల్లో దూసుకెళ్తొన్న అమెజాన్ సంస్థ.. ఇప్పుడు సెల్ఫ్‌డ్రైవింగ్ కార్ల తయారీపై దృష్టి పెట్టింది. డ్రైవర్‌లెస్ కార్ల కోసం ప్రపంచ దిగ్గజాలకు దీటైన సాంకేతికతను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన పేటెంట్ హక్కులను తాజాగా సొంతం చేసుకొంది.
గూగుల్.. ఐబీఎం.. ఉబెర్.. టెస్లా.. టయోటా వంటి ప్రముఖ సంస్థలు సెల్ఫ్‌డ్రైవింగ్ కార్ల తయారీలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఆ కార్లను పరీక్షిస్తున్నాయి. అయితే.. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు ఎదుర్కొనేందుకు ఆయా సంస్థలు అభివృద్ధి చేస్తోన్న సాంకేతికతలో వెసులుబాటు లేదట.
ఎందుకంటే.. కొన్ని మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వాహనాలు వెళ్లేందుకు అధికారులు సిగ్నల్స్ ఇస్తుంటారు. ఉదాహరణకు.. అమెరికాలో ఎప్పుడైనా రోడ్డుపై కుడివైపున వెళ్లాలి. కానీ.. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన సందర్భాల్లో ఎడమవైపున వెల్లేలా అనుమతిస్తారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇప్పటివరకూ అభివృద్ధి చేస్తోన్న సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లకు ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
అమెజాన్ మాత్రం ఆ సమస్యకు తమ సాంకేతికతలో పరిష్కారం ఉందని తెలిపింది. తమ 'సెంట్రలైజ్డ్ రోడ్‌వే మేనేజ్మెంట్' వ్యవస్థ ద్వారా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మధ్య సమాచార మార్పిడి జరుగుతుందని.. దాంతో రాంగ్ రూట్లో వెళ్లాల్సి వచ్చినా కార్లకు ఇబ్బంది ఉండదని అమెజాన్ తన పేటెంట్ పత్రాల్లో వెల్లడించింది. సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికత కోసం 2015 నవంబర్‌లో యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో పత్రాలు సమర్పించగా ఈనెల 17న అనుమతులు లభించాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







