మొదలైన మంచు విష్ణు ద్విభాషా చిత్రం.!

- January 19, 2017 , by Maagulf
మొదలైన మంచు విష్ణు ద్విభాషా చిత్రం.!

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. రామా రీల్స్‌ సంస్థ నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న చిత్రంలో విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన సురభి నటిస్తున్నారు. జి.ఎస్‌. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా జరిపారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు మోహన్‌బాబు క్లాప్‌ కొట్టగా.. సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట మాట్లాడుతూ 'మోహన్‌బాబు, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్‌ వంటి ప్రముఖులు మా సినిమా ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా పతాకంపై నిర్మించనున్న 5వ సినిమా ఇది. ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరసారధ్యం వహించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది' అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com