కువైట్ లో ఘనంగా జరిగిన N.T.R వర్ధంతి

- January 20, 2017 , by Maagulf

కువైట్ లోని ఫర్వానియాలోని SVS. ఆఫిస్ ప్రాంగాణంలో  విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 21 వ వర్ధంతి తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు శ్రీ కుదరవల్లి సుధాకర్ రావు  ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కువైట్ లోని తెలుగు ప్రజలు భారీగా హాజరయి NTR కి నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా ఏర్పాటుచేసిన వర్ధంతి సభలో ఆ పార్టీ నాయకులు NTR  తెలుగుజాతికి చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు గారు మాట్లాడుతూ NTR  తెలుగు  వారి కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు  ,తెలుగు జాతి కోసం ఆయన చేసిన  సేవలను చూసి స్ఫూర్తి పొంది తానుకుడా  తనవంతు సహాయంగా   గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు  వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలను స్వస్ధలాలకు చేర్చుటకు చెన్నై, విజయవాడ, హైదరాబాద్ విమానాశ్రయాల నుండి  ఉచితంగా అంబులెన్స్ ను బహుకరించానని అలాగే NTR MODEL స్కూల్ లో కొంతమంది అనాధపిల్లలను చదివిస్తున్నాని అలాగే కువైట్ లోని ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఇండియన్ ఎంబస్సి వారి సహకారంతో తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SVS CARGO అధినేత మరియు కోశాధికారి రమేశ్ నాయుడు ,సోషల్ వెల్ఫేర్ కో.ఆర్డినేటర్స్ జిలకర మురారి మరియు రవిరాజు మైనార్టీ నాయకులు ముస్తాక్, షేక్ జిలాన్, చోటు మరియు గౌరవ సలహాదారులు కాపెర్ల పట్టాభినాయుడు ,ఖైతాన్ బాబు  అధికార ప్రతినిది వెంకట సుబ్బారెడ్డి ,  P.R.O ఈశ్వర్ నాయుడు,   కమీటీ సభ్యుడు సుబ్రమణ్యం,మన కడప సేవాసమితి అధ్యక్షులు సుబ్బారావు,  కాపు కమీటీ సభ్యులు మలిశెట్టి పెంచులయ్య , ,  యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి జిలకర మురళి యాంకర్ గా వ్యవహరించారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com