ఫిబ్రవరి 3న విడుదల కానున్న 'నేను లోకల్‌'

- January 20, 2017 , by Maagulf
ఫిబ్రవరి 3న విడుదల కానున్న 'నేను లోకల్‌'

నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'నేను లోకల్‌'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 'బాబుగాడి లవ్‌స్టోరీని మీరు చూడబోయే డేట్‌ ఫిక్సపోయింది. 3న థియేటర్‌లో కలుసుకుందాం' అంటూ వినూత్నంగా కథానాయకుడు నానితో రూపొందించిన వీడియోను విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకుడు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే విడుదలై అలరిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com