మరోసారి అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్ బ్రాండ్‌గా ఫ్లిప్‌కార్ట్
- January 20, 2017
ఎలక్ట్రానిక్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారత్‌లో అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్ బ్రాండ్‌గా అగ్రస్థానం సంపాదించింది. 'ది ఇండియన్ ఇ-టెయిలింగ్ లీడర్షిప్ ఇండెక్స్' పేరుతో దేశవ్యాప్తంగా వినియోగదారులపై పరిశోధనా సంస్థ రెడ్ సీర్ కన్సల్టింగ్ ఒక సర్వే నిర్వహించింది. ఉత్పత్తుల ఎంపిక, వినియోగదారుల మద్దతు, రిఫండ్, తిరిగి డెలివరీలను స్వాధీనం చేసుకొనే వేగంతో పాటు పలు అంశాల్లో మిగతా ఇ-కామర్స్ సంస్థలను వెనక్కి నెట్టి ఫ్లిప్‌కార్ట్‌కే ఎక్కువ స్కోరు వచ్చిందని నివేదికలో వెల్లడించింది. దీంతో వరుసగా నాలుగోసారి విశ్వసనీయ బ్రాండ్‌గా ఫ్లిప్‌కార్ట్ తన స్థానాన్ని మరోసారి నిలుపుకొంది. భారత్‌లోని 30 నగరాల్లో 7500 మంది వినియోగదారులపై సర్వే నిర్వహించి నివేదికను తయారు చేసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







