తెలంగాణ జాగృతి - యుఏఈ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రక్త దానం'
- January 21, 2017
తేది 20/01/2017 శుక్రవారం రోజున వారము రోజుల్లో రాబోతున్న 68 వ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని ఉమల్ కోయిన్ హెల్త్ కేర్ అథారిటీ సహకారంతో తెలంగాణ జాగృతి - UAE శాఖ ఆధ్వర్యంలొ సుమారు 50 మంది జాగృతి మరియు ETCA సభ్యులతో మొదటి విడత రక్తదాన శిబిరాన్ని UAQ హాస్పిటల్ లో ఈ రోజు నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న జాగృతి సభ్యులను హెల్త్ కేర్ అథారిటీ అభినందించడం జరిగింది. కార్యక్రమానికి అనుకున్న దానికన్న ఎక్కువమంది సభ్యులు హాజరయినందున వచ్చే శుక్రవారం కూడ రెండవ విడత శిబిరాన్ని నిర్వహించుటకు హెల్త్ కేర్ అథారిటీ ఆమోదం తెలుపడం విశేషం .
ఈ సందర్భంగా యూఏఈ జాగృతి అధ్యక్ష్యులు పీచర కిరణ్ కుమార్ మాట్లాడుతూ జాగృతి ఆధ్వర్యంలో 2017 లో నిర్వహించే కార్యక్రమాలకు సంబందించిన భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేశామని తెలంగాణ జాగృతి అధ్యక్ష్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని ఫిబ్రవరి మాసంలో కలిసి వారి ఆమోదంతో మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని దానికోసం కార్యవర్గాన్ని, కార్యాచరణను కూడ ఏర్పాటు చేశామని మార్చ్ మొదటి వారంలో ఉపాధి కోసం యూఏఈ వచ్చిన తెలంగాణ యువత మానిసిక ఉల్లాసానికై జాగృతి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నామని యూఏఈ లోని అన్ని ప్రదేశాల నుండి సుమారు 25 వివిధ కంపెనీల జట్లు పాల్గొబోతున్నాయని మరియు విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందచేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.
UAE లో నివసిస్తున్న తెలంగాణ మహిళలలకోసం FOOD COMPETITION ను నిర్వహించబోతున్నట్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని సెవన్ ఎమిరేట్స్ సంబంధించి ప్రతి ఎమిరేట్స్ లో పోటీలు నిర్వహిస్తామని అందులో నుండి ఉత్తమ వంటలను తయారు చేసిన ఏడుగురు మహిళలను ఎంపిక చేసి ఫైనల్ పోటీ నిర్వహించ బోతున్నట్టు, ఇలా నిర్వహించడం వల్ల మన ప్రాంత వంటకాల యొక్క విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని మహిళల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహహించిన వాళ్ళం అవుతామని సభ్యులు పేర్కొనడం జరిగింది .
UAQ రక్తదాన శిబిరాన్ని నిర్వహించుటకు కృషి చేసిన ఉమల్ కోయిన్ జాగృతి ఇంచార్జ్ శ్రీమతి శ్రీ ఎలిగేటి దీపిక శ్రీనివాస్ ను సహకరించిన జాగృతి మరియు ETCA సభ్యులకు కిరణ్ కుమార్ అభినందనలు తెలియచేసారు .
ఈ కార్యక్రమంలో జాగృతి సభ్యులు దీపిక, విపుల , శ్రీనివాస్ ఎలిగేటి ,గాంధారి సత్యనారయణ, ప్రవీణ్ కుమార్ వి ఎస్, కొండ శ్రీనివాస్, శేఖర్ గుండవేని, నరేష్ కుమార్ మాన్యం, జగదీశ్ రావు, ప్రశాంత్ రావు, శ్యామ్ సుందర్ , రాజు సట్ల , తోట రాజ శేఖర్, వినోద్ కుమార్, గల్ఫ్ క్రాఫ్ట్ తెలంగాణ యూత్ సభ్యులు పాల్గొన్నారు.







తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







