బాంబు పేలుడు, 20 మంది మృతి...

- January 21, 2017 , by Maagulf
బాంబు పేలుడు, 20 మంది మృతి...

కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శనివారం ఉదయం ఖుర్రమ్‌ ఏజెన్సీలో ఓ కూరగాయల మార్కెట్‌ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాంబు పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ కారణమన్న విషయం తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com