'ఆకతాయి' టీజర్‌ విడుదల...

- January 21, 2017 , by Maagulf
'ఆకతాయి' టీజర్‌ విడుదల...

హైదరాబాద్‌: ఆశిష్‌ రాజ్‌, రుక్సార్‌ మీర్‌లు జంటగా నటించిన చిత్రం ఆకతాయి. రాంబీమన దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విజయ్‌ కరణ్‌, కౌశల్‌ కరణ్‌, హనిల్‌ కరణ్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్‌ ల్యాబ్‌లో శనివారం పరుచూరి గోపాలకృష్ణ టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి మాట్లాడుతూ.. 'ఈ టీజర్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది. చక్కటి క్వాలిటీ కనపడుతోంది.' అన్నారు. దర్శకుడు రాంబీమన మాట్లాడుతూ.. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలున్నాయని మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ బాణీలు చాలా బాగాసమకూర్చారని అన్నారు. నటి అమీషా పటేల్‌ ఈ సినిమాలో ఓ ఐటెం పాటలో కన్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com