ఓ 'కవి కల'
- September 13, 2015
మంచితనమంతా చరిత్ర ప్రవాహంలో
కలిసి పోయి గతమంతా ఘనీభవించి ,,
ఈ మర మనిషి లోకమంతా నాగరికతల ముసుగులో
మునిగి,మమతలు దహనమై మనసు మసి అయిపోయి..
విశ్వమంతా ద్వేష విషజ్వాలలు సంతరించుకున్నాక
ఎక్కడి నుండి వచ్చారో ఆ కాంతి వీరులు, వారితో పాటు
జతకట్టి ఇంకొంత "మానవత వాద" దూతలు,
కొన్ని అనుభూతులు మిగుల్చుకున్న
పిట్టలకు అవాసాలుగా మారి
కల్లోల నిశీధి లో బలవన్మరణం లా కల్లుమూసుకొని,
నిర్వీర్యుడు గా కాలం గడుపుతూ ఉన్న నన్ను,
తమ సూటి ప్రశ్నల ములుకులతో గ్రుచ్చుతూ,ఒక ప్రక్క
అక్షర తీపిదనాల ఆశ చూపుతూ వారంతా ఒకటే పోరు ..
ఆశలు ఆవిరై .. ప్రేమ తైలం అడుగంటు నప్పుడు
క్రొత్త వత్తులు వేయమంటారు ఎలా ..
ఆకులు రాలి మోడువారిన మనసులకు
క్రొత్త చిగురులు పూయించమంటారు ....
మ్రొగ్గ దశలోనే ..పర భాషా యంత్రాలుగా మారుతున్న,
పసి హృదయాలకు మాతృ భాషా కంచెలు నిర్మించమంటూ ..
కానీ ఎలా ? ఏలిక లే, ఓటూ సీటూ కోసం మధ్యం వర్తకం
వ్యాపింప చేస్తున్నప్పుడు
ఇక పామరులు ఆ పాపపు నోటుకు అమ్ముడై,
పంక రూపముగా మారి పోతున్నప్పుడు
అనుమానపు వైవాహికం అదాలత్ అద్దాల్లో విడి వడి,
బొమ్మలుగా మారినప్పుడు,
ఉమ్మడి జీవనం తెగిన తోక చుక్కలుగా రాలి కనుమరుగైనప్పుడు,
ఆరాద్యమె.. వెక్కిరింతలుగా తెరపై వాదోపవాదాలుగా పరిణమించినప్పుడు
మనుష్య సంబంధాలన్ని తమను తాము,తామే సృష్టించుకున్న
డబ్బు మూటల్లో బంధించుకున్నప్పుడు
ఒక చోట తోట కోసం, ఒక చోట ఫ్లాటు కోసం,
ఒక చోట మూల ధనం మూట కోసం పేచిలై,
కన్న వారి పోషణ కాటిన్యమై ప్రస్నార్ధకం గా మారినప్పుడు..
ఇలా దేహాలన్నీ శత సహస్త్ర పైశాచిక అనందాల్లో
పడి ఇహ పర సంబంధాలు వీడి కొట్టుకుంటుంటే,
ఇక ఎలా జరుపను ? ? ?
ఒకరి నొకరు ఆత్మలతో కలుసుకొనే
ఆ కవి సంగమాలు కవిత్వపు ఇష్టా గోష్టులు,
మనిషి మనసుకు మమతలు అద్దీ మళ్లీ
మానవత్వపు పరిమళాలు వెదజల్లే ప్రక్రియ జరిగేనా?
కవి కన్న కలలు నెరవేరేనా ఇక ఈ మనుష్య జీవితానికి మేలు జరిగేనా ..
ఇంకొన్నాళ్ళకైనా ..ఇంకెన్నాళ్ళ కైనా .... ఇది ఇలా జరిగేనా ???
(16-03-2014.. కవి సంగమం..ప్రపంచ కవిత్వ పండుగ 21 మార్చి రోజున ప్రతి సంవత్సరం జరుపుకుంటూ..కవి కల నిజం కావాలి అని ఆశతో )
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







