భారత్ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో 'ఉచిత వైఫై' సేవలు

- September 13, 2015 , by Maagulf
భారత్ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో 'ఉచిత వైఫై' సేవలు

భారత్ దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'ప్రాజెక్ట్ నీలగిరి' పేరిట భారతీయ రైల్వేల కొలాబరేషన్ తో గూగుల్ సంస్థ ఈ సౌకర్యాన్ని కల్పించబోతోంది. . దీనిద్వారా రైల్వేస్టేషన్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణీకులకు తొలి 35 నిముషాలు హైస్పీడ్ యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచం కొంచంగా తగ్గుతూ వస్తుంది. అయితే, 24 గంటల పాటూ ఈ సౌకర్యం ఉంటుంది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ప్రస్తుతం వైఫై సేవలు అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఒక సారి ఈ ఎంపిక పూర్తి కాగానే గుగూల్ వైఫై సేవలను అందుబాటులోనికి తీసుకువస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com