నమో సభలో పాల్గొన్న తెలుగువారికి సర్టిఫికెట్ల ప్రదానం

- September 13, 2015 , by Maagulf

గత నెల అంటే ఆగస్టు 17వ తేదీన, 34 సంవత్సరాల అనంతరం, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోడి దుబాయ్ పర్యటన సందర్భంగా ఇక్కడి క్రికెట్  స్టేడియంలో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో పాల్గొన్న మన తెలుగువారు -అడ్వకేట్ వోబ్బిలిసేట్టి అనురాధ(టీం లీడర్),వందిత రమేష్,వసంత,రాధిక రెడ్డి,విజయ,మాల గోపీనాథ్, ఆర్. ఎస్.ఎస్. రామ్ మాధవ్, రాధ  కిషన్, దుబ్బాల తిరుపతి,  జనగాం  శ్రీను, తోట గణేశ్, లక్ష్మణ్ గౌడ్, పోతరం నరసయ్య, సుంకేటి శ్రీను, పర్శరమ్లు రా లకు భారతీయ జనతా పార్టీ జాతీయ సెక్రెటరీ - శ్రీ రామ్ మాధవ్ గారి చేతుల మీదుగా శుక్రవారం  సర్టిఫికెట్లు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమములో అనురాగ్ భూషణ్(కన్సులర్ జనరల్ అఫ్ ఇండియా) కూడా పాల్గొన్నారు.ఈ విషయమై సర్టిఫికెట్ల స్వీకర్తలు మా గల్ఫ్ ప్రతినిధి తో మాట్లాడుతూ  - ఇది కేవలం తమ వ్యక్తిగత ఆసక్తి మాత్రమే కాక దుబాయ్ లోని తెలుగు వారందరి తరపున తాము పాల్గొన్నట్టు, అది తమ భాద్యత అని కూడా భావిస్తున్నట్టు  తమ  అభిప్రాయాలను పంచుకున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com