పరువు హత్య నేపథ్యంతో 'రా రా రాజశేఖర్‌'..

- January 23, 2017 , by Maagulf
పరువు హత్య నేపథ్యంతో 'రా రా రాజశేఖర్‌'..

'కాదల్‌' చిత్రంలో కుల జాఢ్యాన్ని,'కల్లూరి' చిత్రంలో రాజకీయ కుతంత్రాన్ని, 'వళక్కు ఎన్ 18/9' చిత్రంలో ధనవంతుల అహంకారాన్ని వెండితెరపై ఆవిష్కరించిన యదార్థ చిత్రాల దర్శకుడు బాలాజీ శక్తివేల్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'రా రా రాజశేఖర్‌'. ఇందులో ఆయన పరువు హత్య నేపథ్యాన్ని ఎంచుకున్నారు. దర్శకుడు లింగుసామి సొంత నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లింగుసామి సోదరి కుమారుడు విజయ్‌ మురుగన హీరోగా పరిచయమవుతున్నాడు. కన్నడ చిత్రం 'లూసియా', 'నెరుంగి వా ముత్తమిడాదే' ఫేమ్‌ శ్రుతి హరిహరన హీరోయిన. సుభిక్ష ముఖ్య పాత్రలో నటిస్తుండగా, మాటల రచయిత రామమూర్తి విలన్ పాత్ర పోషిస్తున్నారు.

కొత్త సంగీత దర్శకుడు జావెద్‌ రియాస్‌ సంగీతం, సిదార్థ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. 21వ శతాబ్దంలోనూ పరువు హత్యలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీని వెనుక యదార్థ పరిస్థితులను 'రా రా రాజశేఖర్‌' ద్వారా బాలాజీ శక్తివేల్‌ తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ తరంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్‌ మీడియా గురించి కూడా ఆయన ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పరువు హత్యల నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చినా, ఏ చిత్రంలోను చూపని పరిష్కారాన్ని బాలాజీ శక్తివేల్‌ ఈ చిత్రంలో చూపించబోతున్నారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com