ఇదే తొలిసారి గణతంత్ర వేడుకల్లో...
- January 26, 2017
న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు ఇదివరకెన్నడూ లేని ఆసక్తికరమైన విషయాలకు, ప్రారంభ ఘట్టాలకు వేదికగా నిలిచాయి. ఇండియా గేట్ మొదలు రాష్ట్రపతి భవన్ దాకా మూడు కిలోమీటర్ల మేర భద్రతా దళాలు జరిపిన అద్భుత సైనిక విన్యాసాల్లో... నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కమెండోలకు కూడా ప్రాతినిధ్యం దక్కింది. బ్లాక్ క్యాట్స్‌గా పేరుపొందిన ఎన్ఎస్‌జీ బృందాలునల్లటి యూనిఫామ్, ఆయుధాలు ధరించి అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు... పూర్తి స్వదేశీ విజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అద్భుత విన్యాసంతో అదరగొట్టింది. యూఏఈ నుంచి వచ్చిన 149 మంది సభ్యుల యూఏఈ ప్రెసిడెన్సియల్ గార్డ్ బృందం కూడా భారత త్రివిధ దళాలతో కలిసి కవాతు చేయడం ఈ వేడుకలకే హైలైట్‌గా నిలిచింది.
35 మంది సంగీతకారుల బ్యాండ్ వెంటరాగా రాజ్‌పథ్ వద్ద భారత రాష్ట్రపతి ఘనంగా వందన సమర్పణ చేశారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









