కొత్త ఎఫ్ -15 ఎస్ ఎ విమానంను లాంఛనంగా ప్రారంభించిన కింగ్ సల్మాన్...
- January 26, 2017
రియాద్ : బుధవారం జరిగిన కింగ్ ఫైసల్ ఎయిర్ అకాడమీ 50 వ వార్షికోత్సవ వేడుకలకు కింగ్ సల్మాన్ హజరయ్యారు. ఆ నేపథ్యంలోనే 91 వ బ్యాచ్ కింగ్ ఫైసల్హాఎయిర్ అకాడమీ పట్టభద్రుల విద్యార్థుల స్నాతకోత్సవం, అలాగే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాల అంబుల పొదిలో కొత్త ఎఫ్ - 15 ఎస్ ఎ విమానంను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ సమక్షంలో జరిగింది.ఎయిర్ కాలేజ్ కమాండర్ ఎయిర్ వైస్ మార్షల్ ఖలీద్ అల్ ల'అబౌన్ , కింగ్ సల్మాన్ అల్-బషీర్ స్వాగతించి ప్రసంగించారు. "ఈ రోజు మనం 50 వ వార్షికోత్సవం ఈ పురాతన వ్యవస్థ స్థాపన జరుపుకొంటున్నట్లు పేర్కొంటూ, శిక్షణ ప్రారంభంలో,దివంగత కింగ్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ ద్వారా ప్రారంభించబడింది దేవుడు ఆయన పేరును బట్టి దీవించి ఈ ఎయిర్ అకాడమీ అంచెలంచెలుగా అభివృద్ధి చేశారని అన్నారు. ఈ రంగంలో ఉన్న వారికి కళాశాల పతాకంపై మరింత గౌరవం ఇనుమడింపచేసిందని ఆయన అన్నారు. ఈ కళాశాల ప్రపంచంలో ఉత్తమ విమాన పాఠశాలలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోందని వివరించారు. సుశిక్షుతులైన పైలట్లు గగనతలంలో రక్షణను సమర్ధవంతంగా నిర్వహించడమే కాక వివిధ రంగాల్లో వారి దేశం కోసం పనిచేసినవారికి ఇదొక అమూల్యమైన వేదిక అని అన్నారు. వేలాదిమంది టెక్నీషియన్లు ఎయిర్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్లు వెలుపలకు వచ్చారు. కింగ్ ఫైసల్ ఎయిర్ అకాడమీ 50 వ వార్షికోత్సవ వేడుకలకు అకాడమీ సాధించిన అత్యంత ప్రముఖ విజయాలకు గుర్తుగా చిత్రీకరించిన ఒక చిత్రం కింగ్ సల్మాన్ మరియు ఇతర ప్రేక్షకులు వీక్షించారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









