ప్రౌన్ మలై కర్రీ...
- January 26, 2017
కావలసినవి: రొయ్యలు- 500గ్రా., కొబ్బరి పాలు - రెండు కప్పులు, పెద్ద ఉల్లిపాయ (మందంగా తరిగినది) - ఒకటి , మరో ఒక పెద్ద ఉల్లిపాయముద్ద మెత్తగా రుబ్బినది, అల్లం ముద్ద ఒక టీ స్పూన్, ఒకటిన్నర టీ స్పూన్ కారం, అర టీ స్పూను పసుపు, బిరంజి ఆకులు రెండు, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒకటి, ఒకటిన్నర టీ స్పూను పంచదార, రెండు టేబుల్ స్పూనులు నెయ్యి, పచ్చి మిరపకాయలు మూడు లేక నాలుగు(ముక్కలుగా తరిగినది) గుప్పెడు కొత్తిమీర తరిగినది అలంకరణ కోసం... ఉప్పు తగినంత.
తయారీ విధానం:
మందపాటి గిన్నెలో నెయ్యిని వేడి చేసి బిరంజి ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అరనిమిషం వేగించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో అల్లం ముద్ద, కారం, పసుపు వేసి తిప్పండి. నెయ్యి పైకి తేలిన తరువాత అందులో రొయ్యలు వేసి రెండు నిమిషాలపాటు వేగించండి. తర్వాత కొబ్బరిపాలు, పంచదార, ఉప వేసి బాగా ఉడికించండి. రొయ్యలు ఉడికాయని అనిపించిన తరువాత మూత పెట్టి సన్నని సెగ మీద పది నిమిషాలు ఉంచండి. కొత్తిమీర, పచ్చిమిరపముక్కలతో అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే ప్రాన్ మలై కర్రీ చాలా రుచిగా ఉంటుంది
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









