దుబాయ్ ని అలరించిన జాకిర్ మరియు శంకర్

- January 29, 2017 , by Maagulf

జనవరి 27, శుక్రవారం దుబాయ్‌ టెన్నిస్‌ స్టేడియంలో జాకీర్‌ హుస్సేన్‌ నిర్వాణా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు జాకీర్‌ హుస్సేన్‌ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలాగే ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ తన మధురమైన గానంతో ఆహూతుల్ని ఆనందోత్సాహాల్లో మంచెత్తారు. డ్రాగన్‌ మార్ట్‌ 2 ఈ కార్యక్రమానికి ప్లాటినమ్‌ స్పాన్సరర్‌. ఆర్‌ఎనహెచ్‌ గ్రూప్‌ సమర్ఫణలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో జాకీర్‌ హుస్సేన్‌ అభిమానులు, శంకర్‌ మహదేవన్‌ అభిమానులు, సంగీతాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు మేటి సంగీతకారులు ఈ కార్యక్రమానికి కొత్త ఉత్సాహాన్నిచ్చారు.ఈ ఈవెంట్కి 'Caiyad Phahad' మీడియా డాక్టర్ గా వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com