జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం...

- January 30, 2017 , by Maagulf
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం...

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి వద్ద సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.
వీరిని హుటాహుటిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బండ్లగూడలో విషాదం
బండ్లగూడలోని ఇంద్రప్రస్థకాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ లిఫ్ట్ మీదపడటంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది.
సిరిసిల్లలో విషాదం
సిరిసిల్లలోని రుద్రాంగిలో విషాద ఘటన చోటు చేసుకుంది.
ఒక్కసారిగా తల్లికి ఫిట్స్ రావడంతో ఆమె చేతిలో ఉన్న చిన్నారి బావిలో పడి మృతి చెందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com