కలకలం రేపిన ఐఎస్ పోస్టర్..
- January 31, 2017
ఆర్మీ కంటోన్మెంట్‌కు సమీపంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గోడపత్రిక ప్రత్యక్షమవడం కలకలం రేపింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్ జిల్లాలో సుబథు ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో ఐఎస్ జెండా, గోడపత్రికలను స్థానికులు గమనించారు. హిందీ, ఉర్దూ, ఆంగ్లం భాషలలో పోస్టరు, పతాకాలపై 'త్వరలో ఐఎస్‌ఐఎస్ రాబోతుంది' అనే నినాదం రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిమ్లాకు కేవలం 50 కి.మీ. దూరంలో సుబథు సైనిక స్థావరం ఉంది. సుబథు నుంచి నేపాల్ వరకు మూడు చోట్ల బాంబు దాడులు చేయనున్నట్లు పోస్టర్లలో ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నామని, స్థానికులను ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని సూచించామని తెలిపారు.
ఇంతకుముందు సోలాన్‌లోని ఓ ఆలయం గోడలపై అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో ఇదే రకమైన వ్యాఖ్యలు రాశారని వివరించారు.
డిసెంబరులోనే..
గత డిసెంబరులో బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోస్టర్లకు బాధ్యుడిగా అనుమానిస్తున్న అబీద్ ఖాన్‌ను చర్చి వద్ద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడు కొన్ని నెలలుగా నకిలీ గుర్తింపు కార్డులతో నివాసముంటున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







