ఎగ్జిట్ పర్మిట్స్ ఉచితంగా..
- January 31, 2017
ఎయిర్‌పోర్ట్స్ డిపార్ట్‌మెంట్, లీవ్ నోటిఫికేషన్ (ఎగ్జిట్ పర్మిట్) వలసదారులు, పౌరులకు ఉచితంగానే అందింనున్నామనీ, ఇవి పేపర్‌లెస్‌గా ఉంటాయని తెలిపింది. మెట్రాష్2 మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ), హుకూమి ద్వారా ఇది కండక్ట్ చేయబడుతుంది. వలసదారులు మరియు సిటిజన్స్ ట్రావెల్ ప్రొసిడ్యూర్స్‌ని సులభతరం చేయడానికి ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ట్రావెల్ పర్మిట్స్ సెక్షన్ హెడ్, లెఫ్టినెంట్ కల్నల్ నాజర్ జబిర్ అల్ మల్కి మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ద్వారా వలసదారులు, అలాగే మైనర్ ఖతరీలు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో లీవ్ నోటిఫికేషన్ పొందుతారనీ, ఇమ్మిగ్రేషన్‌కి సంబంధించి వారు ఎలాంటి ప్రింట్ అవుట్ తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. మెట్రాష్ 2, ఎంఓఐ వెబ్‌సైట్ లేదా హుకూమి వెబ్‌సైట్ ద్వారా రిక్రూటర్, వలసదారుడి డేటాని పొందుపర్చుతాడు. ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ అయ్యే ఈ అప్లికేషన్, ఆ తర్వాత అప్రూవ్ అవుతుంది. తద్వారా వలసదారుడు దేశం నుంచి బయటకు వెళ్ళడానికి వీలు కలుగుతుంది. ఖతారీలు కూడా ఇదే తరహాలో ఎగ్జిట్ పర్మిట్‌ని పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







