కుప్పకూలిన భవంతి, 4మంది మృతి

- February 01, 2017 , by Maagulf
కుప్పకూలిన భవంతి, 4మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాజ్‌మాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సుమారు వంద మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని భద్రతా సిబ్బంది రక్షించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రిలో నాణ్యతా లోపం వలనే ప్రమాదం జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ భవనం కూలడంతో సమీపంలోని రెండు ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి గురైన భవనం సమాజ్‌వాదీ పార్టీ నేతకు సంబంధించినదని స్థానికులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com