5 దేశాలపై నిషేధం విధించిన కువైట్
- February 02, 2017
పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాల వారిపై కువైట్ నిషేధం విధించింది. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే కువైట్ కూడా ఐదు దేశాలపై ఆంక్షలు విధించింది. ఈ ఐదు దేశాల వలసదారులు, శరణార్థులు వీసాకు దరఖాస్తు చేసుకోవద్దని వెల్లడించింది. అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులు వలస వస్తారనే ఆందోళనతో ఈ చర్యలు తీసుకున్నట్లు కువైట్ ప్రభుత్వం తెలిపింది. అయితే అమెరికా కంటే ముందుగానే కువైట్ సిరియా దేశీయులపై నిషేధం విధించింది. కువైట్ 2011లోనే సిరియన్లకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపేసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







