రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో దేవీ శ్రీ...

- February 04, 2017 , by Maagulf
రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో దేవీ శ్రీ...

తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌కి చాలా డిమాండ్ ఉంది.  అతని కంపోజ్ చేసిన మ్యూజిక్‌ యువతకు ఓ బూస్ట్ లాంటింది.  సినిమాకు తన సంగీతం ద్వారా ఊపిరిని అందిస్తాడు దేవీ శ్రీ. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించిన ఖైదీనెంబర్ 150 చిత్రంలో దేవీ మ్యూజిక్ ఆ సినిమాకు ప్లస్ పాయింటైంది. ఒక్కో సినిమాకు దేవీ తీసుకునే రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో అంటే దాదాపుగా 2 కోట్లకు పైనే ఉంటుందట.  ఇంక నిర్మాతలు ఆ సినిమాకు సంబంధించి గాయకులకు, గీత రచయితలకు, రికార్డింగ్‌కు వేరేగా డబ్బులు చెల్లించాలి.  అంటే మొత్తంగా ఒక సినిమాకు దాదాపు మూడు కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది నిర్మాత.  అయితే డబ్బు విషయం కంటే తమ సినిమాకు దేవీ సంగీతం చేయడానికి ఒప్పుకుంటే చాలనుకునే నిర్మాతలే ఇండస్ట్రీలో ఎక్కువ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com