వలసదారుడికి మూడేళ్ళ జైలు, 200,000 ఖతారీ రియాల్స్‌ జరీమానా

- February 04, 2017 , by Maagulf
వలసదారుడికి మూడేళ్ళ జైలు, 200,000 ఖతారీ రియాల్స్‌ జరీమానా

నేపాలీ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, 200,000 ఖతారీ రియాల్స్‌ జరీమానా విధించింది దోహా క్రిమినల్‌ కోర్ట్‌. నిషేధిత నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ని సరఫరా చేస్తున్న నేరానికిగాను ఈ శిక్ష విధించడం జరిగింది. న్యాయస్థానంలో పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, నిందితుడిపై నేరాన్ని నిరూపించింది. 5 కిలోల బరువైన ఆంఫిటమిన్‌ పిల్స్‌ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్‌ తెలిపింది. పోలీసులు నిందితుడికి సంబంఇంచిన సమాచారం అందుకోగానే, వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడ్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్లయింట్‌ తరహాలో అండర్‌కవర్‌ పోలీసులు అతన్ని అప్రోచ్‌ అయి, కేసుని ఛేదించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com