400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్క్..
- February 06, 2017
హైదరాబాద్: నగర శివారులోని 400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పార్క్ ద్వారా దాదాపు 70శాతం వైద్య పరికరాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నట్లు స్పష్టం చేశారు. శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలోని బయోలాజికల్ ఈ-లిమిటెడ్ కంపెనీ రూ.300కోట్ల వ్యయంతో సుమారు 29 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న 'బయోలాజికల్ సెజ్'కు కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే జీనోమ్ వ్యాలీలోని ఆరోగ్య కేంద్రంతో పాటు క్యాటిలిస్ట్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ తరహాలోనే ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే వ్యాక్సిన్లతో 20శాతం హైదరాబాద్ నుంచే తయారుకావడం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. జీనోమ్ వ్యాలీలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం వచ్చే రెండేళ్లలో తూముకుంట వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









