ఈ సారి పవన్ తో తీస్తా అంటున్న నితిన్..!!
- September 16, 2015
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్నవిషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంతటి అభిమానికి తన అభిమాన హీరోతో సినిమా నిర్మించే అవకాశం వస్తే ఇక తన ఆనందానికి హద్దేముంది. ప్రస్తుతం నాగార్జున నట వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ 'అఖిల్' సినిమాను నిర్మిస్తున్న నితిన్ తాజాగా పవన్ సినిమా నిర్మించే అవకాశం గురించి ప్రస్థావించారు. 'పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించే అవకాశం వస్తే ఇక వేరే పనులేవి పెట్టుకోకుండా ఆ సినిమా మీద దృష్టి పెడతా. ఆ సినిమా నా ఫిలిం కెరీర్ లోనే చాలా స్పెషల్ అవుతుంది.' అన్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో పవన్ పట్ట తన అభిమానాన్ని ప్రదర్శించిన నితిన్ ఇప్పుడు ప్రెస్ మీట్లలో కూడా తన అభిమాన కథానాయకున్ని పొగిడేస్తున్నాడు. ప్రస్తుతం 'అఖిల్' ప్రమోషన్ తో పాటు తను హీరోగా రూపొందిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా రిలీజ్ లతో నితిన్ బిబీగా ఉన్నాడు. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అ ఆ' షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. సమంత, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో నదియా మరో లీడ్ రోల్ లో నటిస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







