కతార్ మౌలిక సదుపాయాల పెట్టుబడిలో 95 శాతం ట్రాన్స్పోర్ట్ పధకాలకే
- September 16, 2015
రానున్న 5 నుండి 7 సంవత్సరాలలో, కతార్ దేశం తన పెట్టుబడులలో 95 శాతానికి పైగా ట్రాన్స్‌పోర్ట్ పధకాలకే కేటాయించనున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకించి 8500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్ ను విస్తరించేందుకు, 200 బ్రిడ్జిలను, 30 సొరంగ మార్గాలను నిర్మిస్తామని ప్రకటించింది.
ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్ బిన్ న్యాసర్ బిన్ ఖలీఫా అల్-థాని కతార్ ట్రాన్స్‌పోర్ట్ ఫోరం ప్రారం భించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపాదిత ప్రాజెక్టులలో చాలా వానిని ఫీఫా వల్డ్ కప్-2022 కంటే 2 సంవత్సరాలముందే పూర్తిచేస్తామని రవాణా శాఖ మంత్రి హిజ్ హైనెస్ జస్సీమ్ సైఫ్ ఆహ్మెద్ అల్-సులైతీ తెలియజేశారు. పెట్రోలియం ఉత్పత్తులు కాని రంగాలు, సేవా రంగాలు కూడా దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్దాయని ఆయన విశ్లేషించారు. కతార్ నేషణ విజన్-2030 లక్ష్య సాధన దిశగా అన్ని పనులు కొనసాగుతున్నాయని, ఇటీవల ప్రారంభించబడిన, మధ్య ప్రాచ్యంలోనే అతిపెద్డదైన హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఇందులో భాగమేనని అన్నారు. ఒకేసారి 21 సొరంగాలు తవ్వె యంత్రాలతో పని జరుపుతున్న 'దోహా మెట్రో' గిన్నిస్ రికార్డులలోకి ఎక్కిందని తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







