వాయిదా పడ్డ శశికళ ప్రమాణస్వీకారం
- February 07, 2017
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ చెన్నై రానందును శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దిల్లీలో ఉన్న విద్యాసాగర్‌రావు సోమవారం రాత్రి చెన్నైకి రాకుండా ముంబయికి చేరుకున్నారు. శశికళ, దివంగత జయలలితలపై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో త్వరలోనే తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించిన నేపథ్యంలో శశికళతో ప్రమాణస్వీకారం చేయించే విషయంలో గవర్నర్ న్యాయసలహా కోరినట్లు సమాచారం. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేయకుండా నిరోధించాలని కోరుతూ చెన్నైకి చెందిన సెంథిల్‌కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జయలలిత ఆస్తుల కేసులో శశికళ దోషి అని తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వస్తుందని.. అదే జరిగితే రాష్ట్రంలో మళ్లీ శాంతిభద్రతలు అదుపు తప్పే పరిస్థితి వస్తుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









