ఎన్టీఆర్ - బాబీ కలయికలో ఓ చిత్రం విలన్ గా నితిన్...

- February 07, 2017 , by Maagulf
ఎన్టీఆర్ - బాబీ కలయికలో ఓ చిత్రం విలన్ గా నితిన్...

ఎన్టీఆర్ - బాబీ కలయికలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం 'జై లవ కుశ' టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రం కోసం హాలీవుడ్‌కు టెక్నిషన్ వాన్సీ హార్ట్‌వెల్‌ పని చేయనున్నాడు. టెక్నాలజీని ఉపయోగించి మనుషులను విభిన్న రూపాల్లో కనిపించేలా చేయడం వాన్సీ ప్రత్యేకత. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, రోబో సినిమాలకి పనిచేశారీయన. ఈ చిత్రానికి సీ కే మురళీధరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు.
ఈ చిత్రంలో విలన్ గా నటించేందుకు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' కోసం ముందుగా విలన్ పాత్ర కోసం నితిన్ నే అనుకొన్నారు.
అయితే, నితిన్ నో చెప్పేశాడు. ఇప్పుడు తారక్ కి ఓకే చెప్పడం విశేషం.
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రాశీఖన్నాని ఫైనల్ చేసింది చిత్రబృందం. మరో ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 10న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ నెల 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలవ్వనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com