300 కిలోల భారీకాయుడ్ని రక్షించిన ఫైర్‌ఫైటర్స్...
- February 07, 2017
షార్జా: షార్జా ఫైర్‌ఫైటర్స్, 300 కిలోల బరువున్న వ్యక్తిని రక్షించారు. బాల్కనీ డోర్స్ నుంచి ఆయన్ని ఫైర్ ఫైటర్స్ బయటకు తీసుకొచ్చారు. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తి తక్షణం వైద్య చికిత్స కోసం అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళాల్సి ఉండగా, వెళ్ళలేని స్థితిలో పోలీసుల సహాయాన్ని అర్థించారు. షార్జా సివిల్ డిఫెన్స్ సమాచారం అందుకోగానే ఫైర్ ఫైటర్స్‌ని రంగంలోకి దించింది. ఏరియల్ లేడార్ సహాయంతో ఫైర్‌ఫైటర్స్ నాలుగో అంతస్తులో ఉన్న ఆ వ్యక్తిని బయటకు తీసుకురాగలిగారు. ఈ క్రమంలో బాధితుడికి ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. 90 నిమిషాలపాటు ఈ తతంగం నడిచింది. కిందకు దించగానే ఆ వ్యక్తిని అల్ ఖాసిమి ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







