39,000 మంది పాకిస్తానీల డిపోర్టేషన్‌...

- February 08, 2017 , by Maagulf
39,000 మంది పాకిస్తానీల డిపోర్టేషన్‌...

39,000 మంది పాకిస్తానీ దేశీయుల్ని సౌదీ అరేబియా నుంచి గడచిన నాలుగు నెలల్లో డిపోర్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వీసా ఉల్లంఘనల కారణంగానే ఎక్కువమందిని డిపోర్ట్‌ చేసినట్లుగా వారు వివరించారు. రెసిడెన్స్‌ అండ్‌ వర్క్‌ రూల్స్‌కి సంబంధించిన ఉల్లంఘనలు కూడా ఇందులో ఉన్నాయి. దయీష్‌ తీవ్రవాద సంస్థ తరఫున కొందరు తీవ్రవాద కార్యకలాపాల్లోనే పాలుపంచుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాగే పాకిస్తానీ వ్యక్తులు డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌, దొంగతనాలు, ఫోర్జరీ మరియు భౌతిక దాడులు వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు అధికారులు. ఇమ్మిగ్రేషన్‌ విషయంలో ఇంకాస్త కఠినంగా వ్యవహరించి, ఇలాంటి నేరాలకు చెక్‌పెట్టేందుకు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. షురా కౌన్సిల్‌ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్‌ అబ్దుల్లా అల్‌ సాదౌమ్‌, ఈ విషయంపై మాట్లాడుతూ, పాకిస్తాన్‌ ముందుగానే తమ దేశం నుంచి వస్తున్నవారిపై దృష్టిపెట్టాలని అన్నారు. పాకిస్తాన్‌ నుంచి వచ్చినవారే ఎక్కువగా నేరాలకు పాల్పడుతుండడం దురదృష్టకరమని చెప్పారాయన. తాజాగా జెడ్డాలోని అల్‌ హరజాత్‌ మరియు అల్‌ నసీమ్‌ జిల్లాల్లో జరిగిన టెర్రరిస్ట్‌ ఆపరేషన్లలో 15 మంది పాకిస్తానీలు పాల్గొన్నట్లుగా గుర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com