'పాస్వర్డ్స్ చెబితేనే అమెరికా రానిస్తాం'...
- February 08, 2017
వాషింగ్టన్: ఇక నుంచి వీసాకోసం వచ్చేవారు తాము ఉపయోగిస్తున్న సోషల్ మీడియా పాస్ వర్డ్స్‌ను చెప్పేటట్లయితేనే రావాలని అమెరికా అడగనుంది. తమ దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల దేశాలపై నిషేధం విధించిన నేపథ్యంలో తాజాగా చేసిన ఈ ప్రకటన మరింత ఆందోళన సృష్టించనుంది. ఇక నుంచి అమెరికా వచ్చే వారి వివరాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని ఇప్పటికే ట్రంప్ అన్ని దేశాల రాయబార కార్యాలయానికి ఆదేశాలు పంపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పలు మార్గదర్శకాలు వారికి సూచించినట్లు తెలిసింది.
ఇందులో భాగంగా ఇక నుంచి తమ దేశానికి వచ్చే వారు తాము ఉపయోగిస్తున్న సామాజిక అనుసంధాన వేదికల వివరాలు, వాటి పాస్వర్డ్లు కచ్చితంగా వీసాకు ముందు ధృవపత్రాలను తనిఖీ చేసే అధికారులకు కచ్చితంగా చెప్పాలని కోరనున్నారు.
ముఖ్యంగా ఇప్పటికే నిషేధం విధించిన ప్రధాన ముస్లిం దేశాల నుంచి వచ్చే వారి విషయంలో ఈ కఠిన నిబంధనలు అమలుచేయాలని భావిస్తున్నారు.
'మేం నిషేధం విధించిన దేశాల వారిని రాకుండా ఆపడం కష్టం కావొచ్చు.. ఒక వేళ వారు వస్తే కచ్చితంగా ఈ వివరాలు మాత్రం అడుగుతాం. అవి ఇస్తేనే వీసాకు అనుమతిస్తాం. అవిస్తే వారు ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారనే విషయం మాకు తెలుస్తుంది. ఒకవేళ వాళ్లు పాస్ వర్డ్స్ చెప్పకుంటే రావొద్దు' అని అమెరికా అంతర్గత రక్షణ వ్యవహారాల కార్యదర్శి జాన్ కెల్లీ చెప్పారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







